Bangarraju Teaser : బంగార్రాజు టిజర్ రిలీజ్.. బుల్లెట్ బండిపై దూసుకొచ్చిన చిన బంగార్రాజ

-

కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్నినాయన సినిమా తో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పంచ కట్టు తో సరసాలు, వేసిన చిలిపి వేషాలకు బాక్సాఫీస్ బద్దలైంది. బంగార్రాజు గా నాకు చేసిన రచ్చకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమానకు సీక్వెల్‌ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయకుడిగా నాగార్జున చేస్తున్నారు.

ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇక నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. అయితే.. ఇవాళ అక్కినేని నాగ చైతన్య బర్త్‌ డే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. బంగార్రాజు సినిమా నుంచి టిజర్ ను విడుదల చేసింద చిత్ర బృందం.

ఇక ఈ టీజర్ లో నాగచైతన్య మాస్ లుక్ లో కనిపించారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా లో… నాగార్జున స్టైల్ లో ఈ టీజర్ లో నాగచైతన్య మనకు కనిపించాడు. అలాగే బుల్లెట్ బండి పై నాగచైతన్య కనిపించి అందరినీ అలరించాడు. ఇది టీజర్ రిలీజ్ చేయడంపై అక్కినేని నాగార్జునకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు నాగ చైతన్య.

Read more RELATED
Recommended to you

Latest news