ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ పార్టీ…!

-

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ నిలువనుంది. దీనిపై ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం, మెదక్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో కాంగ్రెస్ పోటీ చేయబోతోంది. ఖమ్మంలో రాయల్ నాగేశ్వర్ రావుకు టీపీసీసీ బీఫామ్ ఇచ్చింది. మెదక్‌ జిల్లా నుంచి జగ్గారెడ్డి భార్య నిర్మల బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది. అయితే నల్గొండ స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానంపై కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ చేస్తుందని  టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి తెలిపారు. పార్టీకి సరైన బలం లేకపోయినా.. పోటీ చేయాలని నిర్ణయించామన్నారు.

అధికార పార్టీకి చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మునిసిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. నిధులు, విధులు లేక తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ ఓట్లతోపాటు వారి ఓట్లు కూడా తమకు మళ్లుతాయని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో అధికార టీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా అసంత్రుప్తి ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఇది తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ అనుకుంటుంది.

తెలంగాణలో 12 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూలు విడుదలైన విషయం తెలిసిందే. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అవ్వగా, కరీంనగర్ , మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక వీటికి ఎప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news