ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విశాఖపట్నం : ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగానే కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ బిజెపి నేతలు..కిషన్ రెడ్డి కి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశాఖ పై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో సోము వీర్రాజు ప్రకటించి నిర్ణయమే మా నిర్ణయం.. పార్టీ నిర్ణయని పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశంలోనే విశాఖపట్నానికి పర్యాటక రంగంగా ఎంతో, ప్రాముఖ్యత ఉందని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఇక్కడ పర్యాటక అభివృద్ధి చెందడం లేదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని ప్రాజెక్టుల మంజూరు చేసిన వాటిని రోజు పరిశీలిస్తామని వెల్లడించారు.. పర్యాటక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల, అధికారులతో చర్చించి మరింతగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.