ఈ నెలలో బ్యాంకులకు సెలవలు ఎప్పుడంటే…!

-

అసలే లాక్ డౌన్… జనాలు బయటకు వెళ్ళాలి అంటే కష్టమే. దీనితో ఇప్పుడు ఆర్ధిక వ్యవహారాలూ అన్నీ కూడా బ్యాంకు ల ద్వారానే జరుగుతున్నాయి. పరిమితంగా బ్యాంకు లు అన్నీ కూడా సేవలు అందిస్తున్నాయి. లాక్ డౌన్ ఇప్పుడు రెండో నెలలో ఉంది. దీనితో ఆర్ధిక లావాదేవీలు ఎక్కువగా బ్యాంకు ల్లోనే జరుగుతూ వస్తున్నాయి.

ఈ నెలలో బ్యాంకు సెలవలు పెద్దగా లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మే నెలలోని రెండు, నాలుగో శనివారాలైన 9, 23 తేదీల్లో బ్యాంకులు ఎలాగూ పని చేయవు. మే నెల‌లో వ‌చ్చే ఐదు ఆదివారాలు వస్తున్నాయి. 3, 10, 17, 24, 31 తేదీల్లో ఎలాగూ బ్యాంకులకు ఆ 5 రోజులు సెలవులే. రెండో శనివారాలు, ఆదివారాల్లో సెలవలు కాకుండానే ఈ నెలలో ఉద్యోగులకు మరో అదనపు సెలవు మే డే.

మే 25న రంజాన్ ఉంది. ఆ రోజు కూడా బ్యాంకు లకు సేవలు ఉంటుంది. దాదాపు దేశ వ్యాప్తంగా బ్యాంకు లకు ఇవే సెలవలు ఉన్నాయి. అయితే నెట్ బ్యాంకింగ్ చేసేవారికి మాత్రం ఏ ఇబ్బందులు లేవు. ఇక నగదు లావాదేవీలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆన్లైన్ మీద జాగ్రత్తలు తీసుకుంటూ ఆధార పడాలి అని పలువురు సూచనలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు కూడా ఇదే విషయం చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news