ఐదు రోజులపాటు బ్యాంకులకు సెలవు..!

-

కొన్ని కొన్ని సార్లు ముఖ్యమైన బ్యాంకు పనులు ఉండిపోతూ ఉంటాయి. కాబట్టి సెలవు రోజులు గమనించి పనులు పూర్తి చేసుకోవడం మంచిది లేదు అంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు సెలవు. కనుక దీనిని గమనించి ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే చేసుకోవడం మంచిది.

ఇక బ్యాంకు సెలవులు ఎప్పుడు అనేది చూస్తే… రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆగస్టు 2021లో మొత్తం 15 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. అయితే వీటిలో ఎనిమిది వివిధ రాష్ట్రాల పండుగలు ఉన్నాయి. మిగిలిన ఏడు రోజులు కూడా వీకెండ్ హాలిడేస్. ఇక సెలవుల గురించి చూస్తే ఆగస్టు 19 మొహరం. మొహరం పండుగ 17 సిటీస్ లో చేసుకుంటారు. అగర్తల, అహ్మదాబాద్, బాలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కలకత్తా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయపూర్, రాంచి మరియు శ్రీనగర్. ఈ ప్రాంతాల్లో బ్యాంకులు కి సెలవు.

అదే విధంగా ఆగస్టు 30న జన్మాష్టమి. జన్మాష్టమిని ఎక్కడెక్కడ చేసుకుంటారు అనేది చూస్తే అహ్మదాబాద్, చండీగర్, చెన్నై, డెహ్రడూన్, జైపూర్, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయపూర్, రాంచి, షిల్లాంగ్, షిమ్లా, శ్రీనగర్, గాంగ్టక్. అలానే ఓనం, శ్రీ నారాయణ గురు జయంతి కూడా వచ్చింది. ఈ సందర్భంగా కూడా కొన్ని రాష్ట్రాలలో సెలవులు వుంటాయి.

రాష్ట్రాల వారీగా ఏఏ తేదీలు సెలవు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం:

1) ఆగస్టు 19, 2021 – ముహర్రం (అగర్తలా, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ మరియు శ్రీనగర్)

2) ఆగస్టు 20, 2021 – ముహర్రం/మొదటి ఓనం (బెంగళూరు, చెన్నై, కొచ్చి మరియు తిరువనంతపురం)

3) ఆగస్టు 21, 2021 – తిరువోనం (తిరువనంతపురం మరియు కొచ్చి)

4) ఆగస్టు 22, 2021 – ఆదివారం

5) ఆగస్టు 23, 2021 – శ్రీ నారాయణ గురు జయంతి (తిరువనంతపురం, కొచ్చి)

6) ఆగస్టు 28, 2021 – నాల్గవ శనివారం

7) ఆగస్టు 29, 2021 – ఆదివారం

8) ఆగస్టు 30, 2021 – జన్మాష్టమి (అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ మరియు గ్యాంగ్‌టాక్)

9) ఆగస్టు 31, 2021 – శ్రీ కృష్ణ అష్టమి (హైదరాబాద్)

 

Read more RELATED
Recommended to you

Latest news