తెలుగు దేశం పార్టీకి మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. తెలుగు దేశం పార్టీకి.. సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య… టీడీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం అందుతోంది.
గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పనితీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గోరంట్ల బుచ్చయ్య… ఈ మేరకు టీడీపీ కి రాజీనామా చేయాలని ఆలోచన చేస్తున్నారట. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న గోరంట్ల బుచ్చయ్య.. 1995 టీడీపీ సంక్షోభం లోనూ ఎన్టీఆర్ వెంట వెళ్లారు. అయితే.. 2014 లో అధికారంలోకి వచ్చిన అనంతరం.. మంత్రిగా గోరంట్ల బుచ్చయ్య కు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు. అప్పటి నుంచే చంద్రబాబుపై గోరంట్ల బుచ్చయ్య గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే.. పార్టీ పనితీరులోనూ చంద్రబాబు వైఖరి కూడా తప్పుగా ఉందనే నేపథ్యంలో రాజీనామాకే సిద్ధం అయ్యారు గోరంట్ల బుచ్చయ్య.