మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 7ను ఆఖరి తేదీ.
కనుక ఈ లోగా అప్లై చేసుకోవడం మంచిది. ఈ నోటిఫికేషన్ ద్వారా 10 ఖాళీలను బ్యాంక్ ఆఫ్ బరోడా భర్తీ చేస్తోంది. ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ కరస్పాండెంట్, సూపర్ వైజర్, సీనియర్ మేనేజర్, ఫ్యాకల్టీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వంటి పోస్టులు వున్నాయి.
ఇక ఎవరు అర్హులు అనేది చూస్తే.. ప్రొడక్ట్ హెడ్ విభాగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసుండాలి. మేనేజ్మెంట్ కోర్సుల్లో ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత. ఇది ఇలా ఉంటే అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితర ఖాళీలకు అప్లై చెయ్యాలంటే డిగ్రీ పూర్తి చెయ్యాలి. బీఈ, బీటెక్, ఎంసీఏ చేసిన వారికి ప్రాధాన్యం. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే…
అప్లై చేసుకోవాలంటే ముందు https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
నెక్స్ట్ మీరు కెరీర్ ఆప్షన్ మీద క్లిక్ చెయ్యాలి.
ఆ తరవాత Current Opportunities అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి.
ఇక్కడ కావాల్సిన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్ కింద Apply now అని ఉంటుంది. ఇప్పుడు మీరు దానిపై క్లిక్ చెయ్యండి.
ఫైనల్ గా కావాల్సిన వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి అంతే.