క్రెడిట్‌ కార్డు ద్వారా రెంట్‌ చెల్లిస్తున్నారా..? చేయకపోవడమే బెటర్‌

-

ఈరోజుల్లో అందరూ ఏ చిన్న పెమెంట్ చేయాలన్నా.. ఆన్‌లైన్‌ ద్వారానే చేస్తున్నారు. పాల ప్యాకెట్‌ నుంచి ప్రయాణాల టికెట్‌ వరకూ అన్నీంటికి ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లిస్తున్నారు. డెబిట్‌ కార్డుతో చేసే విషయం పక్కన పెడితే.. క్రెడిట్‌ గురించి మాట్లాడుకుందాం. కొందరు క్రెడిట్‌ కార్డును షాపింగులకు, జల్సాలకు వాడితే.. మరికొందరు క్రెడిట్‌ కార్డు ద్వారా రెంట్‌ పేమెంట్‌ చేసి ఆ డబ్బును అకౌంట్‌లో వచ్చేట్లు చేసుకుంటారు. కొందరు నిజంగానే రెంటే చెల్లిస్తారు. ఏది ఏమైనా.. క్రెడిట్‌ కార్డుతో రెంట్‌ పే చేయడం మంచి ఆలచన కాదని నిపుణులు అంటున్నారు.

ఇటువంటి ఆప్షన్‌లు తరచుగా చాలా డ్రాబ్యాక్స్‌తో వస్తాయి. అనుకోని విధంగా కార్డు హోల్డర్‌ ఫైనాన్షియల్‌ హెల్త్‌పై ప్రభావం చూపుతాయి. క్రెడిట్ కార్డుతో రెంట్ చెల్లించడానికి ముందు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలను పరిశీలిద్దాం.

క్రెడిట్ కార్డుతో రెంట్‌ చెల్లించడంలో డ్రాబ్యాక్స్‌ :

క్రెడిట్ స్కోర్ : క్రెడిట్ కార్డు పేమెంట్లు నేరుగా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయి. ఎవరైనా రెంట్‌ పే చేయడానికి క్రెడిట్‌ కార్డులో ఎక్కువ అమౌంట్‌ ఉపయోగించి, సకాలంలో బ్యాలెన్స్ చెల్లించలేకపోతే, క్రెడిట్ స్కోర్‌పై నెగెటివ్‌ ఇంపాక్ట్‌ చూపుతుంది. ఇది భవిష్యత్తులో లోన్‌లు పొందడం కష్టతరం చేస్తుంది. అలాగే దాదాపు ప్రతి ఖర్చుకు క్రెడిట్ కార్డులను ఉపయోగించడం కూడా క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.

ఫీజులు, యూసేజ్‌ లిమిట్‌ : పేమెంట్స్‌ చేయడానికి క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నప్పుడు, ఫీజులు, యూసేజ్‌ లిమిట్‌లు తెలుసుకోవాలి. కొన్ని క్రెడిట్ కార్డులు రెంట్‌ చెల్లించడం వంటి నిర్దిష్ట లావాదేవీలపై ఎడిషినల్‌ ఫీజులను వసూలు చేయవచ్చు. క్రెడిట్ కార్డులు రెంట్‌ పేమెంట్‌ కోసం ఉపయోగించగల గరిష్ట మొత్తంపై పరిమితులను విధించవచ్చు. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఫీజులు, లిమిట్స్‌ అర్థం చేసుకోవడానికి క్రెడిట్ కార్డు నిబంధనలు, షరతులు తెలుసుకోవాలి.

కొత్త అప్పు : క్రెడిట్ కార్డులతో రెంట్‌ చెల్లించడం వల్ల అప్పులు పెరిగే ప్రమాదం ఉంది. ప్రతి నెలా క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించకపోతే, కాలక్రమేణా డెట్‌(అప్పు) క్రమంగా పెరుగుతుంది.

అధిక ఛార్జీలు : క్రెడిట్ కార్డులు సాధారణంగా నిర్దిష్ట వడ్డీ రేట్లతో వస్తాయి. కాబట్టి రెంట్‌ చెల్లించడం దానికి మరింత యాడ్‌ చేస్తుంది. ప్రతి నెలా బ్యాలెన్స్‌ను పూర్తిగా చెల్లించడంలో విఫలమైతే, కాలక్రమేణా వడ్డీ భారం పెరిగిపోతుంది. క్రెడిట్‌ కార్డు ద్వారా రెంట్‌ చెల్లిస్తే.. పదివేలకు రూ.150- 180 వరకూ పడుతుంది. ఇది అధిక భారమే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news