ఏటీఎం వాడేవారు వీటిని తప్పనిసరిగా పాటించాలి: స్టేట్ బ్యాంక్

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలను అందిస్తోంది. దీనితో కస్టమర్స్ కి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. డబ్బులు ఎఫ్డి చేసుకుని వడ్డీని పొందొచ్చు. అలానే ఇతర లాభాలను కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ పొందొచ్చు.

ఇక ఇది ఇలా ఉంటే ఖాతాదారులు ఏటీఎం కేంద్రాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో అలెర్ట్ గా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఈ మధ్య కాలం లో మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆన్ లైన్ లో మోసాలు అలానే బయట కూడా మోసాలు మనం వింటున్నాం. అయితే వీటిని దృష్టి లో పెట్టుకుని స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి పలు జాగ్రత్తలు చెప్పింది.

ఖాతాదారులు ఏటీఎం కేంద్రాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో చుట్టుపక్కల పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని అంది. అలానే ఏటీఎం కార్డును మిషన్ లో సరిగా ఉంచామా? లేదా? అన్నది పరిశీలించాలని కూడా అంది. అలానే మీరు వెళ్లే ఏటీఎం లో అనుమానాస్పద పరికరాలు వంటివి ఉన్నాయేమో చూసుకోవాలని చెప్పింది.

అదే విధంగా పిన్ ని ఎంటర్ చేసేటప్పుడు మీ కీబోర్డ్ ను చేతితో కవర్ చేసి ఉండాలి. ఎవరూ మీ పిన్ ను చూడకుండా జాగ్రత్త పడాలని చెప్పింది. అలానే ఏటీఎం పిన్ ను కాలానుగుణంగా మార్చుతూ ఉండాలని బ్యాంక్ ఖాతాదారులకు సూచించింది ఎస్బీఐ. ఖాతా స్టేట్ మెంట్ ని కూడా చూసుకుంటూ ఉండాలని అంది.

Read more RELATED
Recommended to you

Latest news