బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక. అక్టోబర్ నెలలో గాంధీ జయంతి, దసరా వంటి ముఖ్య పండుగలు వస్తుంటాయి. వీటితో పాటు మరికొన్ని ప్రత్యేక దినాల్లో కూడా సెలవులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో దాదాపు 16 రోజులపాటు బ్యాంక్ హాలిడేస్ ఉండనున్నాయి. ఇది గమనించి ముందస్తుగా తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవడం మంచిది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి నెలా.. బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా అక్టోబర్ నెలలోని సెలవుల జాబితాను కూడా విడుదల చేసింది.
- అక్టోబర్ 2 (సోమవారం) : మహాత్మా గాంధీ జయంతి
- అక్టోబర్ 12 (ఆదివారం) : నరక చతుర్ధశి (పలు రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
- అక్టోబర్ 14 (రెండో శనివారం) : మహాలయ (కర్ణాటక, ఒడిశా, త్రిపుర, బంగాల్)
- అక్టోబర్ 15 (ఆదివారం) : మహారాజ అగ్రసేన్ జయంతి (పంజాబ్, హరియాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్)
- అక్టోబర్ 18 (బుధవారం) : కతి బిహు (అసోం)
- అక్టోబర్ 19 (గురువారం) : సంవత్సరి పండుగ (గుజరాత్)
- అక్టోబర్ 21 (శనివారం) : దుర్గా పూజ (మహా సప్తమి)
- అక్టోబర్ 22 (ఆదివారం) : మహా అష్టమి (పలు రాష్ట్రాలు)
- అక్టోబర్ 23 (సోమవారం) : మహానవమి/ ఆయుధ పూజ
- అక్టోబర్ 24 (మంగళవారం) : దసరా/ విజయదశమి/ దుర్గాపూజ
- అక్టోబర్ 25, 26, 27 : కొన్ని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అక్టోబర్ 25, 26, 27 తేదీల్లో దుర్గా పూజ/ విజయ దశమి జరుపుకుంటారు. కనుక ఈ తేదీల్లో ఆయా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
- అక్టోబర్ 28 (నాల్గో శనివారం) : లక్ష్మీ పూజ, ప్రగత్ దివస్
- అక్టోబర్ 31 (మంగళవారం) : సర్దార్ వల్లభ్ బాయి పటేల్ జయంతి