ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు పంపించడం.. దాదాపు 5 సార్లు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ఇవాళ సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ జరిగింది. కవిత కేసుతో పాటు గతంలో అరెస్ట్ అయిన నళిని చిదంబరం వంటి వారి కేసులను కూడా పరిశీలించారు. అయితే ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత న్యాయవాదులు ఒకే అంశాన్ని ప్రస్తావించారు. మహిళలను కార్యాలయానికి పిలవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం ముందు చెప్పారు. మరోవైపు సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం మహిళలు అయినా ఎవరు అయినా విచారణ జరగాలని చెప్పింది.
మహిళలను ఈడీ పిలవకూడదని.. ఆర్గ్ మెంట్స్ ప్రారంభమయ్యాయి. మహిళను 5 సార్లు పిలచారని ఈడీ పేర్కొంది. మహిళలను ఇలా పిలవచ్చా అనే కోణంలో కవిత తరపు న్యాయవాదులు వాదించారు. 160 సీఆర్ఫీసీ అనే దానిపై ఇవాళ విచారణ జరిగిందని కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసుపై విచారణ కొనసాగుతుంది. విచారణను మళ్లీ నవంబర్ 20 వరకు వాయిదా వేసింది. నవంబర్ 20 వరకు కవితకు సమన్లు కూడా ఇవ్వబోమని చెప్పింది ఈడీ. మహిళలకు కొన్ని రక్షణలు కల్పించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంటుంది. మహిళా అయినంత మాత్రాన విచారణ వద్దనలేమని కవిత గురించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.