కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటేనే బ్యాంకులకు అనుమతి.. ఆ బ్యాంక్ కొత్త రూల్స్..!

-

కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే దీనితో బ్యాంక్ యూనియన్లు కూడా తగిన చర్యలు తీసుకుంటున్నాయి. బ్యాంకుల్లో రద్దీ ఎక్కువగా ఉండడం తో ఎక్కువగా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటోంది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ప్రైవేట్ రంగానికి చెందిన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ కస్టమర్లు బ్యాంక్ కి రావాలంటే కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుంది అని అంది. నేటి నుండి ఈ సేవలు అమలులోకి రానున్నాయి. బ్యాంక్ ఖాతాదారులు, బ్యాంక్ ఉద్యోగుల రక్షణ లక్ష్యంగా అదనపు భద్రతా నిర్ణయం తీసుకున్నామని బ్యాంక్ అంది.

ఈ బ్యాంక్ దారిలోనే మరిన్ని బ్యాంకులు నడిచే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా బ్యాంక్ యూనియన్లు కూడా అలెర్ట్ అయ్యాయి. బ్యాంకింగ్ పని వేళలను మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. వారానికి 5 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఈమేరకు స్టేట్ లెవెల్ బ్యాంక్స్ కమిటీ కి ఒక లేఖ రాసింది. పనివేళలను మధ్యాహ్నం 2 గంటల వరకే పరిమితం చేయాలని కోరింది.

ఇలా చేస్తే కరోనా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అని బ్యాంకులు అంటున్నాయి. ఖాదాదారులతో ఎక్కువగా మాట్లాడుతుండటం వల్ల బ్యాంక్ ఉద్యోగులు త్వరగా కోవిడ్ 19 బారిన పడే అవకాశం ఉందని ఫోరమ్ అంది. అలానే అర్హత వున్నా బ్యాంక్ ఉద్యోగులు అందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news