మహిళలకు గుడ్ న్యూస్.. రూ.50,000 లోన్.. ఇంటికి వచ్చి మరీ ఇస్తారు..!

-

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి వారికి ప్రోత్సాహం కూడా అవసరం. లోన్ కూడా ఇస్తూ ఉండాల్సి ఉంటుంది. తద్వారా ఆ రుణాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ వ్యాపారాన్ని పెంచుకోగలుగుతారు. మహిళా పారిశ్రామికవేత్తలను చిరు మహిళ వ్యాపారాలని ప్రోత్సహించడానికి IDFC ఫస్ట్ బ్యాంక్ సఖి శక్తి లోన్ ని ప్రారంభించింది. ఈ స్కీంలో మహిళలకి లోన్స్ ఇస్తోంది. ఇందులో 50,000 దాకా ఈజీగా లోన్ వస్తుంది. ఇంటికి వచ్చి లోన్ ఇస్తారు.

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూసేద్దాం.. బ్యాంక్ చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే.. చాలా తక్కువ పత్రాలతో వేగంగా లోన్ తీసుకోవచ్చు. లోన్ ఎందుకు కావాలో చెప్తే దానిని పరిశీలించి వెంటనే లోన్ ఇస్తారు. ఇంటి నుంచి వ్యాపారం చేసుకునే వారికి వీలుగా ఈ లోన్ హెల్ప్ చేస్తుంది. గృహ పరిశ్రమలు, దుకాణాలు, ఏదైనా సేవ చేసేవాళ్లు, హస్తకళ యూనిట్ అలాగే వ్యవసాయ సంబంధిత పనులు ఇలా దేనికైనా సరే లోన్ వస్తుంది. ఇంటికి నీటి సరఫరా కనెక్షన్ కోసం సురక్షిత బావి లేదంటే బోర్వెల్ నిర్మాణం, హెడ్ పంప్, వర్షపు నీటి సేకరణ వ్యవస్థ, నీటిని నిల్వ లేదంటే వాటర్ ప్యూరిఫైయర్ సిస్టం కోసం లోన్ ఇస్తున్నట్లు బ్యాంక్ చెప్పింది.

ఇంటికి ఒక గది నిర్మించుకోవడం లేదంటే పక్కా ఇంటిగా ఇల్లుని మార్చుకునే సౌకర్యం కోసం కూడా లోన్ ఇస్తున్నారు. ఇంటి విస్తరణ, షాపు కోసం గది నిర్మాణం, గోడల నిర్మాణం కోసం కూడా లోన్ ఇస్తున్నారు. లోన్ పై వడ్డీ చాలా తక్కువ ఉంటుందని తెలిపారు. సులభ వాయిదాలతో చెల్లించవచ్చని బ్యాంక్ చెప్పింది. ఈ లోన్ తీసుకునే సమయంలో 25 వేల రూపాయల లోపు లోన్ ఉన్నట్లయితే ప్రాసెసింగ్ ఫీజు ఒక శాతం ఉంటుంది. ఇందులో జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఫెసిలిటేషన్ చార్జీలు ఒకటి నుంచి రెండు శాతం దాకా ఉంటాయి జిఎస్టి అదనం.

Read more RELATED
Recommended to you

Latest news