ఎల్లుండే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ తరుణంలోనే ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా సెప్టెంబరు 2న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలన్నీ శుభ్రం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నర్సీపట్నం మండలం, ధర్మసాగరం గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు..ఈ సందర్భంగా కీలక వ్యాక్యలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పింఛన్ల పెంపు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులున్నా పంపిణీ చేస్తున్నామని.. సెప్టెంబరు ఒకటి ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజే పించన్లను పూర్తిస్థాయిలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 9.30లకే 80 శాతం పంపిణీ అయితే… కొత్తగా అర్హులైన వారికి అక్టోబరు నుంచి అవకాశం ఉంటుందన్నారు. అనర్హులైన వారిని తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని… డ్వాక్రా గ్రూపు మహిళలంతా మొక్కలు నాటాలని కోరారు.