ఈ క్రెడిట్ కార్డులు ఉంటే బెస్ట్..!

-

ఈ మధ్యకాలంలో క్రెడిట్ కార్డుని చాలా మంది వాడుతున్నారా..? మీరు క్రెడిట్ కార్డు తీసుకోవాలని అనుకుంటున్నారా..? అయితే క్రెడిట్ కార్డు గురించి మీరు వీటిని తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. ఐసీఐసీఐ బ్యాంక్ అమెజాన్ క్రెడిట్ కార్డు వలన మంచి బెనిఫిట్స్ ని పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు లాభాలుంటాయి.

credit card | క్రెడిట్ కార్డు
credit card | క్రెడిట్ కార్డు

అమెజాన్ ద్వారా జరిపే ప్రతి కొనుగోలుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందొచ్చు. ఒకవేళ నాన్ ప్రైమ్ మెంబర్లు అయితే కనుక మూడు శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది ఇలా ఉంటే యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గూగుల్ పే రీచార్జ్‌లు, బిల్లు చెల్లింపులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్ లాంటి వాటిల్లో అయితే ఐదు శాతం క్యాష్ బ్యాక్ ని పొందొచ్చు.

అదే విధంగా స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి వాటిల్లో 4 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. హెచ్ఎస్‌బీసీ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డు అయితే జరిపే అన్ని ఆన్‌లైన్ కొనుగోళ్లపై 1.5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కూడా బాగుంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో చేసే కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ని పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ మిలీనియా క్రెడిట్ కార్డు విషయానికి వస్తే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అలానే పేజాప్, స్మార్ట్‌బై ద్వారా ఫ్లైట్స్, హోటల్ బుకింగ్స్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది. ఇలా క్రెడిట్ కార్డు తో ఈ బెనిఫిట్స్ ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news