ఫెస్టివల్ ఆఫర్: తక్కువ వడ్డీకే లోన్స్ ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా..!

బ్యాంక్ ఆఫ్ బరోడా లో అకౌంట్ వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడా అదిరే ఆఫర్స్ ని తీసుకు వచ్చింది. దీనితో కారు కొనాలన్నా లేదా కొత్త ఇల్లు కొనాలనుకున్నా వెంటనే ప్రొసీడ్ అయిపోండి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. భారత దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ సీజన్‌ను దృష్టి లో పెట్టుకొని రీటైల్ లోన్ ఆఫర్స్ ప్రకటించింది.

 

 

హోమ్ లోన్స్ మరియు కార్ లోన్స్ పై అదిరే ఆఫర్స్ ని ఇస్తోంది. ఇప్పుడు వున్నా వడ్డీ కంటే 0.25 శాతం తగ్గించింది. బరోడా హోమ్ లోన్, బరోడా కార్ లోన్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. దీంతో పాటు ప్రాసెసింగ్ ఫీజును కూడా మినహాయించింది బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక వడ్డీ రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే.. హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి, కార్ లోన్ వడ్డీ రేట్లు 7.00 శాతం నుంచి ప్రారంభం అవుతాయి.

అయితే లోన్స్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతోందని బ్యాంక్ అంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ బ్యాంకింగ్ bob World లేదా బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేస్తే రుణాలు వెంటనే మంజూరవుతాయని తెలిపింది. ఇక ఎంత వరకు లోన్ తీసుకొచ్చు అనేది చూస్తే.. గరిష్టంగా రూ.10 కోట్ల వరకు హోమ్ లోన్ పొందొచ్చు. సెమీ-అర్బన్, రూరల్ ప్రాంతాల్లో రూ.1 కోటి వరకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.3 కోట్ల వరకు, ఇతర మెట్రో నగరాల్లో రూ.5 కోట్ల వరకు హోమ్ లోన్ కింద తీసుకోవడానికి వీలవుతుంది.