Today Gold Rate: ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌..! దిగివ‌చ్చిన బంగారం .. అదే బాట‌లో వెండి..

-

Today Gold Rate:  నిత్యం బంగారం, వెండి ధరల్లో మార్పులు చేసుకుంటునే ఉంటాయనే విష‌యం తెలిసిందే.. బంగారం ధ‌ర‌లు ఒక్కోసారి అమాంతం ఆకాశాన్ని అంటుతాయి. మ‌రికొన్నిసార్లు నేల‌కు దిగివ‌స్తాయి. అందుకే వినియోగదారులు బంగారం, వెండి పెట్టుబ‌డుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తారు. అయితే .. నేడు దేశీయ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌ మళ్లీ తగ్గింది.

గ‌త రెండ్రోజులుగా బంగారం ధరలు వ‌స్తున్నాయి. శనివారం కూడా బంగారం ధరలు తగ్గాయి. ఈ ఏడాది బంగారం ధర గరిష్ట స్థాయి 10 గ్రాములకు రూ. 56,200 నుండి రూ .10,150 తగ్గింది. నిన్న బంగారం ధర 1.7 శాతం లేదా రూ .807 తగ్గిపోయింది, వెండి 3.5 శాతం లేదా రూ .2,150 తగ్గింది. గత మూడు రోజుల్లో బంగారం రూ .1200 తగ్గింది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.45,390 గా ఉండగా.. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,390 లు ప‌లుకుతుంది. అంటే నిన్నటి నేటికి తులం మీద రూ.390 మేర ధర తగ్గింది. ప‌సిడి బాట‌లోనే వెండి కూడా న‌డుస్తుంది. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.61,600లుగా ఉంది. కిలో వెండిపై తాజాగా రూ.1200 మేర తగ్గింది.

ప్రధాన నగరాల్లో న‌మోదైన బంగారం వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 గా న‌మోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,690గా ప‌లుకుతుంది. కిలో వెండి ధర రూ.61,600 లుగా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,390 గా న‌మోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,390గా ప‌లుకుతుంది. వెండి ధర కిలో రూ. 61,600 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 గా న‌మోదు కాగా, 24 క్యారెట్ల ధర రూ.47,350గా ప‌లుకుతుంది. కిలో వెండి ధర రూ.65,900 లుగా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 గా న‌మోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ప‌లుకుతుంది. వెండి ధర రూ. 65,900 వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,400 గా న‌మోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350గా ప‌లుకుతుంది. వెండి ధర రూ.65,900 లుగా కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news