ఈ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్… కీలక నిర్ణయం తీసుకున్న బ్యాంక్..!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లో మీకు ఖాతా వుందా..? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి రిలీఫ్ కలగనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు బ్యాంక్ తెలిపింది. దీనితో బ్యాంక్ లో డబ్బులు దాచుకునే వాళ్ళకి బాగా బెనిఫిట్ కలగనుంది. అయితే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవడం తో గతం లో కంటే ఈసారి అధిక వడ్డీ రానుంది. ఇక వడ్డీ రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే.. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది.

ఏడాది ఎఫ్‌డీల పై వడ్డీ రేటు 10 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5 శాతానికి చేరింది. కాల పరిమితిలోని ఎఫ్‌డీల పై వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 5.45 శాతానికి పెరిగింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల దాకా పెంచింది బ్యాంక్.

ఈ ఫిక్సెడ్ డిపాజిట్లు పై వడ్డీ రేట్లు ఫిబ్రవరి 14 నుండి అమలు లోకి రానున్నాయి. అదే విధంగా దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా వడ్డీ రేట్లను పెంచింది. దీనితో ఎస్బీఐ కస్టమర్స్ కి కూడా లాభదాయకంగా ఉంటుంది.