ఈ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్…వడ్డీ రేట్లలో తగ్గింపు..!

సొంతిల్లు అనేది ప్రతీ ఒక్కరి కల. ఇల్లు కొనడానికి చాలా మంది హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే తప్పక మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాలలోకి వెళితే.. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త రేట్లు డిసెంబర్ 13 నుంచి అమలులోకి రానున్నాయి.

గృహ రుణాలపై వడ్డీ రేట్లను 6.40 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అంది. ప్రస్తుతం 6.80 శాతం వడ్డీకే గృహ రుణం ఇస్తోంది. ఈ బ్యాంక్ మార్కెట్ పోటీని దృష్టిలో ఉంచుకుని 7.05 శాతం నుంచి 6.80 శాతానికి బ్యాంక్ తగ్గించింది. అయితే రిటైల్ బొనాంజా ఫెస్టివ్ ధమాకా ఆఫర్ కింద వడ్డీ రేట్ల తగ్గింపు జరిగింది.

ఈ ఆఫర్ తో లోన్స్ పై మరెంత ఆదా చేసుకోచ్చు కస్టమర్స్ అని బ్యాంక్ అంది. టాప్-అప్ లోన్ వడ్డీ రేటు పై 0.25 శాతం తగ్గింపు ఇవ్వడంతో పాటు ఎలాంటి ప్రాసెసింగ్ రుసుమును వసూలు చేయకూడదని బ్యాంక్ నిర్ణయించింది. పిల్లల చదువులకు, కుమార్తె పెళ్లికి లేదా ఇతర వాటికి కూడా ఉపయోగించవచ్చు. రుణ చెల్లింపుతో పాటు, టాప్-అప్ లోన్ , నెలవారీ వాయిదాలను కూడా చెల్లించాలి.