హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్లు.. తక్కువ వడ్డీకే రూ.75 లక్షల వరకు లోన్ పొందండి..!

-

దేశీయ అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ పండుగ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లు తీసుకు రావడం జరిగింది. కేవలం హెచ్‌డీఎఫ్‌సీ ఏ కాకుండా అనేక బ్యాంకులు కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్స్ ఇస్తున్నాయి. ‘ఫెస్టివ్‌ ట్రీట్స్ 3.0’ పేరుతో వ్యక్తిగత రుణాలు, కార్డులు, ఈఎంఐలపై 10,000కు పైగా ఆఫర్లు అందిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది.

 

hdfc bank
hdfc-bank

అలానే మరెన్నో ఆఫర్స్ కి కూడా తీసుకు వచ్చింది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. 100 కంటే ఎక్కువ ప్రదేశాల్లో అమెజాన్, శాంసంగ్, విజయ్ సేల్స్ వంటి 10 వేలకు పైగా వ్యాపార సంస్థలతో కలిసి కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఆఫర్లు ఇస్తోంది బ్యాంక్. ఈ ఫెస్టివ్ ట్రీట్ లో భాగంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్స్ కూడా ఇస్తోంది. 10.25% వడ్డీ రేటుతో వ్యక్తిగత రుణాలపై ఆఫర్లు ఇస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

ద్విచక్ర వాహన రుణాలను వడ్డీరహిత లేదా రాయితీ వడ్డీ రేట్లతో ఇస్తోంది. మరి కొన్ని ఆఫర్స్ కూడా వున్నాయి. ఇక వాటి కోసం కూడా చూస్తే.. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై 22.5 శాతం వరకు క్యాష్‌బ్యాక్, నో-కాస్ట్ ఈఎంఐ ఇస్తోంది. అలానే ఐఫోన్ 13 పై రూ. 6,000 క్యాష్‌బ్యాక్. ఇతర ప్రీమియం ఫోన్‌లపై కూడా కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా పొందొచ్చు.

అదే విధంగా 4 శాతం కన్నా తక్కువ వడ్డీ రేట్లపై ద్విచక్ర వాహన రుణాలు. వాహనాల రేటుకు తగ్గట్లు 100% వరకు రుణ మొత్తం అందించడం జరుగుతోంది. ట్రాక్టర్ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజు, 90 శాతం వరకు నిధులు. ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం డిస్కౌంట్‌తో పాటు రూ.75 లక్షల వరకు హామీ అవసరంలేని బిజినెస్ లోన్స్ ని కూడా బ్యాంక్ ఇస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news