బ్యాలెట్‌ పేపర్లు తీసువెళ్లి గుద్దారు : రింగింగ్ పై మంచు విష్ణు సంచలనం !

మా అసోషియేషన్‌ ఎన్నికల పోలింగ్‌ పై మంచు విష్ణు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల పోలింగ్‌ ల్లో రింగింగ్‌ జరిగిందని మంచు విష్ణు ఆరోపించారు. బ్యాలెట్‌ పేపర్లు తీసుకెళ్లి గుద్దారన్నారు. అది ప్రకాశ్‌ రాజ్‌ కు గుద్దారా ? లేదంటే నాకు గుద్దారో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు విష్ణు. దీనిపై ప్రశ్నించేందుకు బ్రహ్మానందం గట్టిగా అరిచారని ఫైర్‌ అయ్యారు.

దీనిపై ఎన్నికల అధికారి కి ఫిర్యాదు చేశామని.. చెప్పారు మంచు విష్ణు. ఇక మంచు విష్ణు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల పోలిం గ్‌ కాసేపు నిలిచిపోయింది. ఈ నేపథ్యం లోనే ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు బృందాలను పిలిపించారు ఎన్నికల అధికారి. రెండు బృందాలతో చర్చలు, రిగ్గింగ్‌ చేసినట్లు తేలితే ఫలితాలు ప్రకటించను, కోర్టుకు వెళ్తామని ప్రకటించారు ఎన్నికల అధికారి. దీనిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. కాగా.. ఇప్పటి వరకు మా ఎన్నికల్లో 250 కి పైగా ఓట్లు పోల్‌ అయ్యాయి.