క్రెడిట్ కార్డు విషయంలో ఎక్కువమంది చేసే రెండు తప్పులివే..!

-

ఈ మధ్య కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ ని ఉపయోగిస్తున్నారు. మీ దగ్గర కూడా క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీరు తప్పక కొన్ని ముఖ్యమైన విషయాలని తెలుసుకోవాలి. లేదు అంటే ఇబ్బంది పడాలి. పూర్తి వివరాల లోకి వెళితే.. క్రెడిట్ కార్డుని వాడటం వల్ల పలు రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అదే మీరు కనుక అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు వస్తాయి.

 

ముఖ్యంగా క్రెడిట్ కార్డుని వాడే వాళ్ళు ఈ రెండిటినీ మరచిపోకూడదు. ఆ తప్పుల్ని చేయకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదు అంటే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. రుణలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డు ద్వారా మీ డబ్బులని ఏటీఎం నుంచి విత్డ్రా చెయ్యద్దు. ఇలా కనుక చేసారంటే చార్జీలు ఎక్కువ పడతాయి.

అలానే డబ్బులు తీసిన దగ్గరి నుంచి వాటిని చెల్లించే వరకు కూడా మీకు వడ్డీ పడుతూనే వస్తుంది. కాబట్టి ఈ తప్పుని మీరు అస్సలు చెయ్యకండి. అదే విధంగా క్రెడిట్ కార్డు బిల్లును ప్రతీ నెలా కూడా కచ్చితంగా పే చెయ్యాల్సి ఉంటుంది. పూర్తిగా చెల్లించకుండా కేవలం మినిమమ్ బ్యాలెన్స్ మాత్రమే చెల్లిస్తే మీరే నష్టపోతారు. అసలుతో పాటు వడ్డీ కూడా పెరుగుతూ వస్తుంది. అందుకని నెలనెలకు మీరు చెల్లించే మొత్తం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి పే చేసేటప్పుడు వదిలేయకుండా మొత్తం చెల్లించేస్తేనే బెస్ట్.

Read more RELATED
Recommended to you

Latest news