ఇందిరాగాంధీ ఫోటోను షేర్ చేసిన పవన్ కళ్యాణ్ !

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా… స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా…మోడీ సర్కార్‌ ను టార్గెట్‌ చేస్తూ.. ఈ ఉద్యమం కొనసాగుతోంది. అయితే.. ఈ ఉద్యమానికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీతో పాటు ప్రతి పక్షాలు కూడా మద్దతు ప్రకటించాయి. సీఎం జగన్‌ అయితే… పీఎం మోడీకి మూడు సార్లు లేఖలు కూడా రాశారు. అయినప్పటీకి…ప్రయివేటీకరణపై కేంద్రం తగ్గడం లేదు.

ఇక వారం రోజుల కిందట.. బీజేపీ మిత్ర పక్షమైన.. జనసేన పార్టీ సైతం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కార్మికులకు మద్దతు పలికింది. అలాగే… స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని… డెడ్‌ లైన్‌ కూడా వైసీపీ ప్రభుత్వానికి ప్రకటించారు పవన్‌. కానీ వారం గడిచినా.. వైసీపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీతో ఉన్న ఓ న్యూస్‌ పేపర్‌ ను షేర్‌ చేశారు పవన్‌.

ఈ పేపర్‌ లో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి… మరియు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఉద్యమం చేసిన అమృత రావు కూడా ఉన్నారు. 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన… అమృతరావు రావును పొగుడుతూ.. పవన్‌ ఆ న్యూస్‌ పేపర్‌ ను షేర్‌ చేశారు. స్టీల్‌ ఉద్యమాన్ని… మరో రీతిలో ముందుకు తీసుకు పోవడానికే ఈ పాత సంఘటనలు పవన్‌ గుర్తు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.