డిసెంబర్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్…!

-

ప్రతీ నెల మొదట్లో కొన్ని విషయాల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే డిసెంబర్ 1 నుంచి కూడా కొన్ని కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. ఇక వాటి కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. గ్యాస్ మొదలు క్రెడిట్ కార్డ్స్ వరకు చాలా వాటిలో మార్పులు రానున్నాయి.

 

cash

క్రెడిట్ కార్డులో మార్పులు:

క్రెడిట్ కార్డ్ వాడే వాళ్లకి షాక్ తగలనుంది. ఈఎంఐ ద్వారా జరిపే కొనుగోళ్లకు అదనపు ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ కొనుగోళ్లపై రూ.99 + ట్యాక్సులు పే చెయ్యాలని స్టేట్ బ్యాంక్ అంది. అంటే ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు మర్చంట్స్ దగ్గర ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ కొత్త రూల్ డిసెంబర్ ఒకటి నుండి అమలులోకి వస్తోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్:

అలానే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను తగ్గించింది. 2021 డిసెంబర్ 1 నుంచి 2.80 శాతం వడ్డీ ఇవ్వనుంది. ఇప్పుడైతే 2.90 వార్షిక వడ్డీ ఇస్తోంది. దీనితో ఇక సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10,00,000 లోపు ఉన్నవారికి 2.80 శాతం వడ్డీ, రూ.10,00,000 కన్నా ఎక్కువ ఉంటే 2.85 శాతం వడ్డీ లభిస్తుంది.

యూఏఎన్‌ను ఆధార్ నెంబర్‌తో లింక్:

యూనివర్సల్ అకౌంట్ నెంబర్‌కు (UAN) ఆధార్ నెంబర్‌నుతో ఈ ఒకటో తేదీ లోగా లింక్ చేయాలి. లేకపోతే ఈపీఎఫ్ అకౌంట్‌లో యజమాని వాటా జమ అవ్వదు.

అగ్గిపెట్ట ధరలు:

14 ఏళ్ల తర్వాత అగ్గిపెట్ట రేటు పెరగడం ఇదే మొదటిసారి. అగ్గిపెట్టె కొనడానికి ఇకపై రెండు రూపాయలు చెల్లించాలి. డిసెంబర్ 1 నుంచే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.

అమెజాన్ ప్రైమ్:

ఇక నుండి ఈ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఎక్కువ ఖర్చు చేయాలి. ప్రైమ్ మెంబర్‌షిప్ ధరల్ని ఏకంగా 50 శాతం పెంచారు. డిసెంబర్ 14 నుంచి యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్‌కు రూ.1,499, మంత్లీ ప్లాన్‌కు రూ.179, క్వార్టర్లీ ప్లాన్‌కు రూ.459 చెల్లించాలి.

గ్యాస్ సిలెండర్:

డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరల్ని సవరించనున్నాయి. నవంబర్‌లో కమర్షియల్ సిలిండర్ ధరను రూ.266 పెంచాయి. మరి డిసెంబర్ 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో చూడాలి.

పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్:

నవంబర్ 30 లోగా లైఫ్ సర్టిఫికెట్ ని ఇవ్వాలి. లేదంటే పెన్షనర్లకు డిసెంబర్ నుంచి పెన్షన్ రాదు. కనుక నవంబర్​ 1 నుంచి నవంబర్​ 30 మధ్య బ్యాంకులకు లైఫ్​ సర్టిఫికెట్​ ఇవ్వాలి.

Read more RELATED
Recommended to you

Latest news