సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుద‌ల‌… విషమంగానే పరిస్థితి

-

ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల అయింది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆరోగ్య హెల్త్ బులిటెన్ ను కిమ్స్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. న్యూమోనియా తో బాధపడుతూ నవంబర్ 24 న సిరివెన్నెల ఆస్పత్రి లో చేరారని హెల్త్ బులిటెన్ లో కిమ్స్ వైద్యులు పేర్కొన్నారు.

నిపుణులైన వైద్యుల తో సిరివెన్నెల సీతా రామశాస్త్రి కి వైద్యం అందిస్తున్నామని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని కిమ్స్ వైదులు ప్రకటన చేశారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని కిమ్స్ వైద్యులు బులిటెన్ లో వివరించారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆరోగ్యం పై ఎవరు కూడా ఆందోళన చెందన వసరం లేదని వైద్యులు చెప్పారు.

కాగా నిన్న సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. శ్వాసకోస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను సికింద్రాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు ఆయన కుటుంబ సభ్యులు.

Read more RELATED
Recommended to you

Latest news