ఆధార్‌ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్‌ అవసరం లేదు: ఈపీఎఫ్‌వో

-

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) మార్గం ఈజీ అయింది. ఇక నుంచి క్లెయిమ్​లు ఈజీగా పరిష్కారమవుతాయి. క్లెయిమ్‌తో పాటు చెక్, బ్యాంకు పాస్‌పుస్తకం కాపీ ఇవ్వలేదంటూ క్లెయిమ్‌ తిరస్కరించకుండా చందాదారులకు వెసులుబాటు కల్పించింది. అయితే చందాదారుడి బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ఆమోదించిన వారికే ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది.

చందాదారుడి ఖాతా వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్‌ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాసుపుస్తకం జతచేయాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్​వో తెలిపింది. ఆధార్‌ కేవైసీ పూర్తయిన చందాదారుల క్లెయిమ్‌లపై ‘బ్యాంకు కేవైసీ ఆన్‌లైన్లో ధ్రువీకరణ పూర్తయిందని చెప్పింది. చెక్, పాస్‌ పుస్తకం జత చేయాల్సిన అవసరం లేదంటూ క్లెయిమ్‌ దరఖాస్తులో నోట్‌ ఉంటుందని ఈపీఎఫ్‌వో వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా క్లెయిమ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని బ్యాంక్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version