Bank Holidays: ఈ నెలలో బ్యాంకులకు 21 రోజుల సెలవులు..!

-

బ్యాంక్ లో మనకి ముఖ్యమైన పనులు ఉంటాయి. సమయానికి పూర్తి చేసుకోవాలని అనుకునే సరికి బ్యాంక్ సెలవు అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక బ్యాంకులు ఏయే రోజులు సెలవు అనేది ముందే తెలుసుకోవాలి. ఈ నెల లో బ్యాంకులకు 21 రోజులపాటు సెలవులు ఉన్నాయి. అయితే ఎప్పుడు, ఏ చోట సెలవో ఇప్పుడే చూద్దాం. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. 21 రోజుల సెలవుల్లో 14 రోజులు ఆర్‌బీఐ అధికారిక సెలవులు కాగా, మిగతా 7 రోజులు వీకెండ్ హాలిడేస్.

 

అక్టోబర్ 1 – అర్ధ సంవత్సర క్లోజింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ (గ్యాంగ్‌టక్), అక్టోబర్ 2 – గాంధీ జయంతి (అన్ని రాష్ట్రాల్లో సెలవు), అక్టోబర్ 3 – ఆదివారం, అక్టోబర్ 6 – మహాలయ అమవాస్య (అగర్తల, బెంగళూరు, కోల్‌కతా), అక్టోబర్ 7 – మేరా చౌరెన్ హుబ ఆఫ్ లైనింగ్‌తో సనామహి (ఇంపాల్), అక్టోబర్ 9 – రెండో శనివారం, అక్టోబర్ 10- ఆదివారం, అక్టోబర్ 12- దుర్గా పూజ (అగర్తల, కోల్‌కతా).

అక్టోబర్ 13- మహాష్టమి (పలు రాష్ట్రాల్లో), అక్టోబర్ 14 – దుర్గా పూజ (పలు రాష్ట్రాల్లో), అక్టోబర్ 15 – దసరా ( ఇంపాల్, సిమ్లా మినహా అన్ని రాష్ట్రాలలో సెలవు), అక్టోబర్ 16 – దుర్గా పూజ (గ్యాంగ్‌టక్), అక్టోబర్ 17- ఆదివారం, అక్టోబర్ 18- కటి బిహు (గువాహతి), అక్టోబర్ 19 – ఈద్ ఇ మిలాద్ ( తెలుగు రాష్ట్రాల్లో సెలవు), అక్టోబర్ 20- మహర్షి వాల్మికి పుట్టిన రోజు (పలు రాష్ట్రాల్లో), అక్టోబర్ 22 – ఈద్ ఇ మిలాద్ (జమ్మూ శ్రీనర్), అక్టోబర్ 23 – నాలుగో శనివారం, అక్టోబర్ 24 – ఆదివారం, అక్టోబర్ 26 – అసెషన్ డే (జమ్మూ శ్రీనగర్), అక్టోబర్ 31 – ఆదివారం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version