97% పైగా రూ.2000 నోట్లు వెనక్కి: ఆర్‌బీఐ

-

భారత్లో రూ.2000 నోట్లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు తమ వద్ద ఉన్న రెండు వేల నోట్లను బ్యాంకుల్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఇప్పటికే పలుమార్లు గడవు పొడిగిస్తూ నోట్లను ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కలిపింది. అయితే తాజాగా దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఉన్న రూ.2000 నోట్లలో 97.38 శాతం మేర బ్యాంకులకు వెనక్కి వచ్చేశాయని ఆర్‌బీఐ ప్రకటించింది. రూ.9,330 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఇంకా ప్రజల వద్ద ఉన్నట్లు వెల్లడించింది.

ఈ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు గతేడాది మే 19వ తేదీన ఆర్‌బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామణీలో ఉండగా 2023 డిసెంబరు 29వ తేదీ నాటికి అవి రూ.9,330 కోట్లకు తగ్గాయని ఆర్‌బీఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల వద్ద ప్రజలు ఈ రూ.2000 నోట్లను డిపాజిట్‌ చేయొచ్చని లేదా ఇతర నోట్లకు మార్పిడి చేసుకోవచ్చని సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news