SBI స్పెషల్ గోల్డ్ స్కీమ్… బంగారం పెడితే ఈ లాభాల్ని పొందొచ్చు…!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన కస్టమర్స్ కి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కస్టమర్లకు ఇచ్చే సేవల్లో గోల్డ్ స్కీమ్ కూడా ఒక భాగమనే చెప్పాలి. ఎస్‌బీఐ కస్టమర్ల కోసం ప్రత్యేకమైన గోల్డ్ డిపాజిట్ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.

SBI
SBI

దీని వలన కూడా కస్టమర్స్ కి చాలా లాభదాయకరంగా ఉంటుంది. అయితే మీ బంగారాన్ని స్టేట్ బ్యాంక్ లో పెడితే ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. ఎస్‌బీఐ రీవ్యాంప్డ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌ లో చేరిన వారు ఇంట్లో బీరువాలో వృథాగా పడి ఉన్న బంగారాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకో వచ్చు. తద్వారా వడ్డీ రాబడి పొందొచ్చు.

ఏడాది నుంచి 15 ఏళ్ల కాల పరిమితితో మీరు మీ బంగారాన్ని బ్యాంక్‌లో ఉంచచ్చు. ఈ స్కీమ్ ఏడాది నుంచి మూడేళ్లు, ఐదేళ్ల నుంచి ఏడేళ్లు, 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల కాల పరిమితితో అందుబాటులో ఉంటుంది. అయితే మీకు నచ్చిన దానిని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవుతుంది.

అయితే దీనిలో మీరు కనీసం 10 గ్రాముల నుంచి బంగారాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు గమనించండి. మీరు ఎంత బంగారం అయినా డిపాజిట్ చెయ్యచ్చు. ఇది ఇలా ఉంటే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్‌పై 0.5 శాతం నుంచి 2.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. బంగారం డిపాజిట్ చేసే వారికి గోల్డ్ డిపాజిట్ సర్టిఫికెట్ ఇస్తారు. బంగారం పెట్టిన నెల నుండి కూడా మీకు డబ్బులు ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news