వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని దారుణం…

మానవత్వం మంటకలిసి పోతోంది. రక్త సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికమైన సుఖాలకు ముక్కుపచ్చలారని పిల్లలను కడతేరుస్తున్నారు. వివాహేతర సంబంధాలకు అడ్డుగా వస్తున్నారని సొంత పిల్లలనే చంపేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే రాజమండ్రి ఆనంద్ నగర్ లో చోటు చేసుకుంది. రాజమండ్రికి చెందిన మహిళ వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నారని తన ఇద్దరు పిల్లల్ని ఉరివేసి అతి కిరాతకంగా హత్య చేసింది. 13 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో రాజమండ్రికి వచ్చిన అనూష అక్కడే స్థిర పడింది. 

బ్యూటీషియన్ గా పనిచేస్తున్న అనూషకు సతీష్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పిల్లలతో అనూషకు గొడవలు జరిగాయి. ఈ క్రమంలోనే హత్యలు చేసినట్లు తెలుస్తోంది. హత్యల అనంతరం ప్రియుడికి ఫోన్ చేసి ఘటన గురించి సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం ఘటనపై మరన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. అనూషనే చంపిందా.. లేక ఇతరుల ప్రోధ్బలంతో హత్యలు చేసిందా అనే వివరాలను పోలీసులు రాబడుతున్నారు. మ్రుతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.