ఏటీఎం లో డబ్బులను విత్ డ్రా చేసేవారికి ఎస్బీఐ హెచ్చరిక..

-

ప్రముఖ భారతీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు కస్టమర్లను అలర్ట్ చేస్తూ వస్తుంది..ఈ బ్యాంకు శాలరీ అకౌంట్ అయితే డబ్బులను ఏటీఎం నుంచి డ్రా చేస్తారు.ఏటీఎం సెంటర్ల దగ్గర అనేక మోసాలు జరుగుతుంటాయి. కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్ లాంటి మోసాలు మామూలైపోయాయి. అయితే కస్టమర్లు జాగ్రత్తపడితే ఇలాంటి మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు..

ఈ మోసాలకు బ్రేక్ వేసేందుకు బ్యాంకులు కూడా సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. అందులో భాగంగా ఎస్‌బీఐ రెండేళ్ల క్రితం ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్ తీసుకొచ్చింది. మీరు డబ్బులు డ్రా చేయడానికి మీ డెబిట్ కార్డ్ పిన్ ఎంటర్ చేస్తే సరిపోదు. ఓటీపీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐ ఏటీఎంలో మీరు రూ.10,000 లోపు డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ అవసరం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. ఎస్‌బీఐ ఏటీఎంలల్లో లావాదేవీల కోసం మా ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్ మోసగాళ్లకు వ్యాక్సినేషన్ లాంటిది. ఇలాంటి మోసాల నుంచి మిమ్మల్ని రక్షించడం మా ప్రాధాన్యతల్లో ఫస్ట్ లో ఉంటుంది అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది..

ఎస్‌బీఐ ఓటీపీ బేస్డ్ క్యాష్ విత్‌డ్రాయల్ సిస్టమ్ ద్వారా మీరు రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయడానికి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీతో పాటు మీ డెబిట్ కార్డ్ పిన్ కూడా ఎంటర్ చేయాలి. మరి ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మీరు డబ్బులు ఎలా డ్రా చేయాలి? తెలుసుకోండి..ఎస్‌బీఐ ఏటీఎంలో మీ డెబిట్ కార్డ్ స్వైప్ చేయాలి. ఆ తర్వాత మీరు డ్రా చేయాలనుకునే మొత్తాన్ని ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. నాలుగు అంకెల ఓటీపీ ఎంటర్ చేసి నగదు విత్‌డ్రా చేయొచ్చు. ఈ ఓటీపీ కేవలం ఒక ట్రాన్సాక్షన్‌కు మాత్రమే వర్తిస్తుంది.

ఎస్‌బీఐ ఏటీఎం కార్డు లేకపోయినా డబ్బులు డ్రా చేయడం సాధ్యం. ఎస్‌బీఐ చాలా కాలం క్రితమే ఈ టెక్నాలజీ కూడా తీసుకొచ్చింది. అయితే ఈ పద్ధతి ఉపయోగించకుండా ఇప్పటికీ ఎస్‌బీఐ ఏటీఎం కార్డుతో  డబ్బులు డ్రా చేసేవారు ఉన్నారు. మీ ఏటీఎం కార్డు అస్సలు ఉపయోగించకుండా ఓటీపీ ద్వారా సులువుగా డబ్బులు డ్రా చేయొచ్చు.

ఇందుకోసం మీరు యోనో యాప్‌లో రిజిస్టర్ చేయాలి..కార్డు రహిత లావాదేవీల కోసం యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత Request YONO cash పైన క్లిక్ చేయాలి. మీకు ఎంత నగదు కావాలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత 6 అంకెల పిన్ క్రియేట్ చేయాలి. ఏటీఎంకు వెళ్లిన తర్వాత కార్డ్ లెస్ ట్రాన్సాక్షన్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీరు క్రియేట్ చేసిన 6 అంకెల రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మరో పిన్ వస్తుంది. ఆ పిన్ కూడా ఏటీఎంలో ఎంటర్ చేసి నగదును డ్రా చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Exit mobile version