ఈరోజు నుండి ఈ బ్యాంకు ఏటీఎంలు పని చెయ్యవు..!

ఈ బ్యాంకు ఏటీఎంలు నేటి నుండి పని చెయ్యవు అని బ్యాంక్ తెలిపింది. కనుక ఈ బ్యాంక్ ఏటీఎం సేవలని పొందేవాళ్ళు తప్పక దీనిని గమనిస్తే మంచిది. ఇక దీని కోసం వివరంగా చూస్తే..
అక్టోబర్‌ 1, 2021 నుంచి.. అనగా నేటి నుంచి సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఏటీఎం సేవలు నిలిచిపోనున్నాయి.

 

atm

ఈ విషయం బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే సూర్యోదయ్ బ్యాంకు ఏటీఎం కార్డు లేదా డెబిట్ కార్డును వినియోగించుకుని ఏటీఎం లో నగదును విత్‌డ్రా చేసుకోవడానికి అవ్వదు అని… ఇతర బ్యాంకు ఏటీఎంలలో విత్‌డ్రా చేసుకోవచ్చని సదరు బ్యాంకు తమ ఖాతాదారులకు తెలిపింది. అలానే తమ ఖాతాదారుల్లో చాలామంది తమ బ్యాంకు ఏటీఎంలను వినియోగించడం లేదని తెలిసింది అని అందుకనే తమ బ్యాంకు ఏటీఎం సెంటర్లను కొనసాగించడం లాభదాయకమైన డీల్ కాదని ఏటీఎంలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం అని సూర్యోదయ్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. భాస్కర్ బాబు అన్నారు.

ఇది ఇలా ఉండగా తమ బ్యాంకు డెబిట్ కార్డును వినియోగించుకోవాలని భావించే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని… వేరే ఏటీఎం లో ఉచిత లావాదేవీలు జరిపే అవకాశం కస్టమర్లకు కలగజేస్తున్నట్లు చెప్పారు. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుకు మొత్తం దేశవ్యాప్తంగా 555 బ్రాంచ్‌లు, 26 ఏటీఎంలు ఉన్నాయి. ఏటీఎం సేవలను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు ఇతర బ్యాంకింగ్ సేవలు మాత్రం అలానే జరుగుతాయి.