డిజిటల్, క్రిప్టో కరెన్సీ పై చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. వచ్చే శీతకాల పార్లమెంటు సమావేశాలలో ఈ డిజిటల్, క్రిప్టో కరెన్సీ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి కే చాలా సార్లు డిజిటల్, క్రిప్టో కరెన్సీ పై కేంద్ర ప్రభుత్వం, ఆర్ బీ ఐ స్పందించాయి.
ఈ డిజిటల్ క్రిప్టో కరెన్సీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కు చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంలో వస్తున్న పార్లమెంటు సమావేశాలలో వీటిని పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే దీని కోసం క్రిప్టో కరెన్సీ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు ఈ శీతకాల సమావేశాలలో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ బిల్లు పార్లమెంటు ఉబయ సభలలో ఆమోదం పొందుతే మన దేశం లో అధికారిక డిజిటల్ కరెన్సీ వస్తుంది. అలాగే దీని తో పాటు అన్ని ప్రైవేటు డిజిటల్, క్రిప్టో కరెన్సీ ల పై నిషేధం విధించే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. కాగ నిషేధం కాకుండా ఈ డిజిటల్, క్రిప్టో కరెన్సీ ల వల్ల వచ్చే ఆదాయంలో పన్ను చెల్లించే విధంగా కొత్త చట్టాలనే తీసుకువచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.