దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. దాదాపుగా దేశంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ డోసుల సంఖ్య 110 కోట్లకు చేరుకుంది. అయితే ఇటీవల కాలంలో వ్యాక్సిన్ కార్యక్రమాలపైస అవగాహన పెంచేందుకు… వ్యాక్సినేషన్ ను ప్రోత్సహించేందుకు పలు రెస్టారెంట్లు, వ్యాపారులు చాలా ఆఫర్లను పెడుతుండటం మనం చూశాం. అయితే తాజాగా మద్యంపై ఓ నగరంలోని మద్యం షాపులు బంఫర్ ఆఫర్ ప్రకటించారు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని మాంద్ సౌర్ నగరంలో మూడు మద్యం షాపులు వినూత్న ఆఫర్ ప్రకటించాయి. వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి మద్యం ధరల్లో డిస్కౌంట్లను ప్రకటించాయి. పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్న వినియోగదారులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ చూపిస్తే.. మద్యంపై 10 శాతం తగ్గించి ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంతో మందుబాబుల్లో హుషారు నెలకొంది. ఈ ప్రకటన చూసైనా వ్యాక్సినేషన్ పూర్తి కాని మందుబాబులు మందుకు వస్తారని మద్యం షాపులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.