అక్కడ 7 లక్షల మరణాలు తప్పకపోవచ్చు… కరోనా తీవ్రతపై హెచ్చిరిస్తోన్న WHO

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కల్లోలం కలిగిస్తుంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ప్రాన్స్, జ్ర్మనీ, బ్రిటన్, ఆస్ట్రియా, రష్యా వంటి దేశాల్లో కోవిడ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా కరోనా సోకడం కలవరపరుస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అంచానా ప్రకారం యూరప్ లో ఇప్పటి నుంచి మార్చి 1, 2022 వరకు 7 లక్షల మరణాలు సంభవిస్తాయని హెచ్చిరిస్తోంది. ఈ శీతాకాలంలో యూరప్ ఖండంలో మరణించే వారి సంఖ్య 22 లక్షలకే చేరవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంగళవారం తెలిపింది.  53 దేశాలలో 49 దేశాలు ఐసీయూలో అధిక,  తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవచ్చని WHO విశ్వసిస్తోంది.

యూరప్ లో డెల్టా వేరియంట్ తీవ్రత కారణంతో పాటు, కరోనా నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. యూరప్ లో ఇప్పటికే ఆస్ట్రియా దేశం లాక్ డౌన్ విధించింది. రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటే మరిన్ని దేశాలు కూడా లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది.