క్రెడిట్‌ కార్డు బిల్లు సమయానికి కట్టకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి..!

ఈ మధ్య కాలం లో చాలా మంది క్రెడిట్ కార్డుని వాడుతున్నారు. పైగా ఇప్పుడు క్రెడిట్ కార్డుని పొందడం కూడా సులభమే. చాలా బ్యాంకులు అన్ని వర్గాల వారికి క్రెడిట్‌ కార్డులను ఇస్తున్నారు. ఒకప్పుడు క్రెడిట్ కార్డుని పొందాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. అయితే క్రెడిట్ కార్డుని వాడుతూ సరైన టైం కి బిల్ పే చెయ్యకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ఇక దాని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. చెల్లింపు తేదీ గడిచిపోతే మీరు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలానే మీరు ఎంత అమౌంట్ వరకు కట్టగలరో అంతే వాడుకోవడం మంచిది.
బిల్లు జనరేట్‌ అయిన తర్వాత గడువు తేదీలోగా చెల్లించాల్సి ఉంటుంది. లేదు అంటే లేట్‌ పేమెంట్‌ చార్జీలు కూడా కట్టాలి.

వాడిన అమోట్‌ను మొత్తం చెల్లిస్తే ఎలాంటి సమస్య ఉండదు. పూర్తిగా చెల్లించకుండా సగం సగం చెల్లించినట్లయితే మీకు చార్జీలు బాధ తప్పదు అని గమనించండి. పైగా వడ్డీ, చక్రవడ్డీ అంటూ పెనాల్టీ చార్జీలు వేస్తుంటాయి. క్రెడిట్‌ కార్డులు జారీ చేసిన సమయంలో వినియోగదారులకు 45-50 రోజుల వడ్డీ రహిత వ్యవధిని విధిస్తాయి.

అప్పటిలోగా చార్జెస్ లేకుండా తీసుకున్న అమౌంట్ చెల్లించాలి. అయితే క్రెడిట్‌ కార్డు తీసుకునే ముందు అన్ని వివరాలు తెలుసుకోవాలి. కార్డును వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సమయానికి బిల్లు చెల్లించకాపోతే పెనాల్టీ కట్టాలి. కార్డు వుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తే ఇబ్బంది మీకే.