లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇవి పక్కా చూసుకోండి..!

-

సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఒక ఇంటిని కొనాలంటే పెద్ద మొత్తంలో డబ్బు కావాలి. ఇంత పెట్టుబడి పెట్టడం అవసరమా లేదంటే అద్దె ఇల్లు తీసుకోవడం మంచిదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పటికైనా ఒక సొంత ఇంటిని నిర్మించుకోవడం మంచిది. అయితే అద్దెకి తీసుకోవడం వలన ప్రయోజనాలు ఏంటంటే..? ఇల్లు అద్దెకి తీసుకుంటే ఒకవేళ ఉద్యోగం లో మార్పు ఉన్నా లైఫ్ స్టైల్ మారినా ఎలాంటి ఆలోచన లేకుండా మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. అవసరమైన చోటికి వెళ్లిపోవచ్చు.

కొనుగోలుతో పోలిస్తే ఇంటిని అద్దెకి తీసుకోవడానికి తక్కువ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉంటాయి. డౌన్ పేమెంట్ లేదంటే లాంగ్ టర్మ్ మార్ట్ గేజ్ ఉండదు. ప్రాపర్టీ ధరలు ఎక్కువగా ఉన్న నగరాల్లో నెలవారి ఈఎంఐ చెల్లించడం కంటే అద్దెకు తీసుకుంటే చౌకగా మనకి లభిస్తాయి. ముంబైలో అధిక ధరలు, అద్దె నిష్పత్తిని పరిశీలిస్తే రెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఇల్లు కొనడం వలన ఉపయోగం ఏంటంటే..? ఇంటిని కొనుగోలు చేయడం వలన దాని విలువ పెరుగుతుంది.

ప్రాపర్టీని సొంతం చేసుకోవడం వలన ప్రయోజనం ఉంటుంది. హోమ్ లోన్ పై చేసే ప్రతి చెల్లింపు ఈక్విటీని నేర్పిస్తుంది. కాలక్రమమైన ఆస్తిపై మీ యాజమాన్యాన్ని పెంచుకుంటారు భారతదేశంలో అద్దెలు కాస్త తక్కువ ఉన్నాయి. సాధారణంగా ఇంటిని కలిగి ఉండడం వలన అదే ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేయడానికి ముందస్తుగా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్, ట్యాక్స్, మెయింటెనెన్స్ వంటివి భరించాలి.

అద్దెతో పోల్చుకుంటే నెలవారి ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి. అద్దెకు తీసుకోవాలా లేదంటే మీరు కొనుగోలు చేయాలా అనే దానిని మీరు ప్రైస్ టు రెంట్ రేషియో చెక్ చేయాలి రేషియో 20 కంటే ఎక్కువ ఉంటే అద్దెకు తీసుకోవడం మంచిది. 15 కంటే తక్కువ ఉంటే కొనుగోలు చేయడం వలన ప్రయోజనం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ అయితే ఆర్థిక స్థిరత్వం దీర్ఘకాలిక ప్రణాళికల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ముందస్తు ఖర్చులు కూడా తక్కువ ఉంటాయి. సేవింగ్స్ కాపాడుకోవాలనుకునే వాళ్ళు అయితే రెంట్ కి తీసుకోవడం మంచిది. కొనుగోలు చేయడం వలన ఆస్తి విలువ, స్థిరత్వం లభిస్తాయి

Read more RELATED
Recommended to you

Latest news