నెలాఖర్లో మూడు రోజులు బ్యాంకులు బంద్…! ఎందుకంటే…!

-

దేశవ్యాప్తంగా బ్యాంక్ యూనియన్లు మరోసారి సమ్మెకు దిగుతున్నాయి. వేతన సవరణ విషయమై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ముందుకు సాగని నేపధ్యంలో జనవరి 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని బ్యాంకు యూనియన్లు నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని బ్యాంకు యూనియన్లకు సమ్మె చెయ్యాలని బ్యాంకు యూనియన్ల సమాఖ్య పిలుపునిచ్చింది.

సమ్మె కారణంతో జనవరి 31 (శుక్రవారం), ఫిబ్రవరి 1 (శనివారం) బ్యాంకులు మూతపడతాయి. దానికి తోడు ఫిబ్రవరి 2 ఆదివారం కావడంతో ఆ రోజు బ్యాంకులకు సెలవు దినం. దాంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు. మార్చి 11 నుంచి 13వ తేదీ వరకు కూడా సమ్మెను నిర్వహిస్తామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య ప్ర్కోంది. అయినా సరే, సమస్య పరిష్కారం కాకపోతే,

ఏప్రిల్‌ 1 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని బ్యాంకు యూనియన్లు ఈ సందర్భంగా హెచ్చరించాయి. భారతీయ బ్యాంకుల సంఘంతో వేతన సవరణపై చర్చలు విఫలం కావడంతో యునియన్ ఈ నిర్ణయం తీసుకుంది. కనీసం 15శాతం వేతనాలను పెంచాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. బ్యాంకుల సమ్మె కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్త పడితే మంచిది అని పలువురు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news