తెలంగాణలో జోరందుకున్న బతుకమ్మ చీరల పంపిణీ

-

తెలంగాణ ఆడబిడ్డలకు ప్రతి ఏటా బతుకమ్మ పండుగకు చీరలను కానుకగా అందిస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరల పంపిణీ జరుగుతోంది. పలు చోట్ల స్వయంగా ప్రజాప్రతినిధులే చీరలు పంపిణీ చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్​లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చీరలు పంపిణీ చేశారు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజున పేదింటి మహిళలు కూడా కొత్త వస్త్రాలు ధరించి ఆనందంగా పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తోందని దానం నాగేందర్ అన్నారు. వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందిరికి ఈ చీరలు అందజేస్తున్నామని తెలిపారు.

మరోవైపు హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా జడ్పీ ఛైర్‌ పర్సన్‌ గండ్ర జ్యోతి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ఆడపడుచులకు పెద్దన్నలా సీఎం కేసీఆర్‌ చీరలు అందిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news