పబ్‌జి ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. బ్యాటిల్ గ్రౌండ్స్ గేమ్ బీటా వెర్ష‌న్ వ‌చ్చేసింది..!

-

ప‌బ్‌జి ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌కు గాను బీటా వెర్ష‌న్ వ‌చ్చేసింది. మే 18వ తేదీన ఈ గేమ్‌కు ప్రీ రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో జూన్ 18వ తేదీ వ‌ర‌కు ఈ గేమ్‌ను లాంచ్ చేస్తార‌ని తెలిసింది. అయితే అందుకు ఒక్క రోజు ముందుగానే గేమ్ కు సంబంధించి బీటా వెర్ష‌న్‌ను విడుద‌ల చేయ‌డం విశేషం.

ప‌బ్‌జి

అయితే ప్ర‌స్తుతం కేవ‌లం కొద్ది మందికి మాత్ర‌మే బీటా వెర్షన్ అందుబాటులో ఉంది. దీన్ని ప్ర‌యోగాత్మ‌కంగా క్రాఫ్ట‌న్ కంపెనీ ప‌రిశీలిస్తోంది. ఈ క్ర‌మంలోనే పూర్తి వెర్ష‌న్‌ను లాంచ్ చేసేందుకు మ‌రో 10-15 రోజులు ప‌ట్ట‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. అదే నిజం అయితే ఈ నెలాఖ‌రు వ‌ర‌కు గేమ్ లాంచ్ అవుతుంది. ఇక ప‌బ్‌జి లాగే ఈగేమ్‌ను కూడా తీర్చిదిద్దారు. కానీ కొద్దిపాటి మార్పులు చేశారు.

గేమ్‌కు ప్రీ రిజిస్ట‌ర్ చేసుకున్న వారికి గేమ్ లాంచ్ అవ‌గానే ప‌లు గిఫ్ట్‌ల‌ను అందిస్తారు. ప్ర‌త్యేక‌మైన 4 రివార్డుల‌తోపాటు రెకాన్ మాస్క్, రెకాన్ ఔట్ ఫిట్‌, సెల‌బ్రేష‌న్ ఎక్స్‌ప‌ర్ట్ టైటిల్‌, 300 ఏజీ ల‌భిస్తాయి. ఇక ఈ గేమ్‌ను ఆండ్రాయిడ్ 5.1.1 ఆపైన వెర్ష‌న్ క‌లిగిన డివైస్‌ల‌లో ఆడ‌వ‌చ్చు. ర్యామ్ 2 జీబీ ఉండాలి.

ప‌బ్‌జిని బ్యాన్ చేయ‌డంతో ప‌బ్‌జి ప్రియులు ఎంతో నిరాశ‌కు గుర‌య్యారు. కానీ ఈ కొత్త గేమ్‌ను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి వారు మ‌ళ్లీ ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఈ గేమ్‌కు బీటా వెర్ష‌న్ కూడా వ‌చ్చేసింది. దీంతో గేమ్ ఎప్పుడు లాంచ్ అవుతుందా ? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news