బతుకమ్మ చీరల పంపిణీ అప్పుడే..?

-

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగను ఎంతో వైభవంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు అందరూ కొత్త బట్టలు ధరించాలి అనే ఉద్దేశంతో టిఆర్ఎస్ సర్కార్ అందరికీ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది.

అక్టోబర్ రెండో వారంలో బతుకమ్మ చీరల పంపిణీ ఉండబోతుంది అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 317.81 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల తయారీకి ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 287 రకాల చీరలను తయారు చేసిన ప్రభుత్వం ఏకంగా కోటి మంది మహిళలకు ఈ సారి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బతుకమ్మ చీరలు అన్నీ ఆయా జిల్లాలకు పంపింది పూర్తయినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version