ఆసీస్ తో వన్ డే లకు ఇండియా జట్టు ఎంపిక.. మొదటి రెండు మ్యాచ్ లకు కోహ్లీ, రోహిత్ దూరం !

-

సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్యన మూడు వన్ డే ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ యాజమాన్యం జట్టును ప్రకటించగా, తాజాగా బీసీసీఐ కూడా ఇండియా జట్టును ప్రకటించింది . కాగా ఇందులో కొన్ని కీలకమైన మార్పులు ఉండడం విశేషం. మొదటి రెండు వన్ డే లకు ఒక జట్టును మరియు మూడవ వన్ డే కు వేరొక జట్టును ప్రకటించింది ఇండియా యాజమాన్యం. ఈ విధంగా చూస్తే మొదటి రెండు వన్ డే లకు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లు దూరం కానుండగా ఆఖరి వన్ డే కు వచ్చి జట్టుతో కలవనున్నారు.

మొదటి రెండు వన్ డే లకు ఇండియా జట్టు: కె ఎల్ రాహుల్ (కెప్టెన్), గిల్, గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరా, షమీ, తిలక్ వర్మ, ప్రసిద్ద కృష్ణ, అశ్విన్ మరియు వాషింగ్టన్ సుందర్

మూడవ వన్ డే : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, గిల్, రాహుల్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, జడేజా, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, షమీ, విరాట్, కుల్దీప్, అక్షర్, అశ్విన్ మరియు వాషింగ్టన్ సుందర్

Read more RELATED
Recommended to you

Latest news