నెల రోజుల చంటి బిడ్డతో విధులకు మేయర్… కమిట్మెంట్ అంటే ఇది… !

-

ఈ మధ్యనే కేరళ రాష్ట్రంలో అత్యంత తక్కువ వయసులో (21 సంవత్సరాలు) తిరువనంతపురం మేయర్ గా ఎంపిక అయ్యి చరిత్ర సృష్టించింది ఆర్య రాజేంద్రన్. ఈ వార్త కొన్ని రోజుల వరకు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ విషయాన్ని మర్చిపోక ముందే మరో వార్తతో ఆర్య రాజేంద్రన్ తెగ వైరల్ అవుతోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్య రాజేంద్రన్ నెల రోజుల ముందు పండంటి ఆడబిడ్డకు జన్మించిన విషయం తెల్సిందే. వాస్తవంగా అయితే ఈ సమయంలో దాదాపుగా పాపకు కనీసం మూడు నెలలు వచ్చే వరకు అయినా మెటర్నిటీ సెలవులు తీసుకుంటూ ఉంటారు. కానీ ఈమె ఎటువంటి సెలవులను తీసుకోకుండా ప్రసవం అయిన నెల రోజుల తర్వాత విధుల్లోకి రావడం అందరికీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. పైగా చంటి బిడ్డతో ఈమె విధుల్లోకి రావడం ఎందరినో షాక్ చేసింది అని చెప్పాలి .

ప్రస్తుతం ఈమె తన ఆఫీస్ లో పాపను ఒడిలో పెట్టుకుని ఫైళ్లపై పై సంతకాలు చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా కొందరు వర్క్ కమిట్మెంట్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news