తెలంగాణ రాజకీయాల్లో ఎన్నో అంచనాలతో పార్టీని పెట్టి సీఎం కావడమే తన లక్ష్యమంటూ చెప్పుకుంటున్న వైఎస్ షర్మిల(sharmila)కు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. తన తండ్రి పేరుమీద ఇలా పార్టీ పెట్టగానే ఇతర పార్టీల్లోని అసంతృప్తులు అందరూ వచ్చి తన పార్టీలో చేరుతారని ఆమె ఆశించారు. కానీ ఆదిలోనే ఆమెకు పెద్ద సమస్యలు వస్తున్నాయి.
మొదటి నుంచి ఆమె పార్టీపై బీటీమ్ అనే ముద్ర పడింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో మీడియా కథనాల్లో ప్రచురించడంతో అసలు ఆమె పార్టీ టీఆర్ ఎస్ కు బీ టీం అని కొందరుప్రచారం చేస్తే మరికొంరేమో లేదు కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రోత్సాహంతోనే పెట్టిందని ప్రచారం చేశారు.
ఇప్పుడు ఇదే ఆమెకు పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె తన పార్టీని బలోపేతం చేసేందుకు ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలకు తన నాయకులతో ఫోన్లు చేయించి తన పార్టీలో చేరాలని కోరుతున్నప్పటికీ ఆమెను పెద్దగా ఎవరూ పట్టించుకోవట్లేదు. అసలు మీది ఏ పార్టీకి బీటీమ్ అని చాలా మంది అడుగుతున్నారని తెలుస్తోంది. దీంతో ఈ ప్రశ్నలకు షర్మిల స్పష్టమైన క్లారిటీ ఇచ్చి ప్రజల్లో నమ్మకం కలిగిస్తే గానీ ఆమె పార్టీలోకి ఎవరూ చేరేలాగా లేరు.