వైరల్ వీడియో; తేనెటీగల టీం వర్క్ చూడండి…!

-

ఈ సృష్టిలో కొన్ని కొన్ని సంఘటనలు మనను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. పక్షులు, జంతువులు చేస్తున్న కొన్ని చేష్టలు మన మనసుకి బాగా దగ్గరవుతాయి. వాటిల్లో ఉండే ఒకరకమైన కనపడని ప్రతిభ అలరిస్తుంది. తాజాగా తేనెటీగలు ఒక బాటిల్ క్యాప్ ని ఓపెన్ చేసిన విధానం వాటి టీం వర్క్ అబ్బురపరిచింది.

అది ఏంటీ అంటే, బయట ఉన్న ఒక తేనె బాటిల్ మీద వాలిన తేనె టీగలు ఆ బాటిల్ మూతను చాలా కష్టపడి తీసిన వీడియోని అక్కడ ఉన్న ఒక వ్యక్తి షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ వీడియో లో దాదాపు ఒక పది ఈగలు మూతను తీయడానికి గానూ చాలా కష్టపడుతున్నాయి.

పైన ఉన్న క్యాప్ ని అన్నీ కలిసి చాలా జాగ్రత్తగా తీస్తాయి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాటిని అలాగే వదిలేసారు. తాము తయారు చేసిన తేనె కోసం అవే మళ్ళీ పోరాటం చేస్తున్నాయని కష్టపడితే ఫలితం ఉంటుంది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో మీరు కూడా ఒక లుక్కేయండి.

Read more RELATED
Recommended to you

Latest news