సరిగా పది రోజుల క్రితం హైదరాబాద్ లో నమోదు అయిన కరోనా వైరస్ కేసులు చూసి… దేశం మొత్తం కూడా ఒకటే మాట మాట్లాడింది. హైదరాబాద్ మరో ఢిల్లీ, మరో ముంబై అయ్యే అవకాశాలు ఉన్నాయి అని… కట్టడి చేయడం కేసీఆర్ సర్కార్ కి సాధ్యం కాదు అని… కాని వారం రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారం రోజుల్లో పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసారు. దేశ రాజధాని ఢిల్లీ కూడా షాక్ అయింది.
కరోనా కట్టడిలో హైదరాబాద్ మహానగరం లో తీసుకున్న చర్యలు షాక్ కి గురి చేసాయి. పదుల సంఖ్యలో నమోదు అయిన కేసులు వందలకు వెళ్ళే అవకాశం ఉందని భావించారు అందరూ కూడా. కాని సింగిల్ డిజిట్ కి రావడం స్పష్టంగా అర్ధమవుతుంది. రోజు రోజుకి కరోనా పెరగడం లేదు తగ్గుతూ వస్తుంది. దీనికి కారణం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే అని స్పష్టంగా చెప్పవచ్చు.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ దోమ కూడా నగరంలోకి రాకుండా గోడ కట్టినట్టు చేసారు. ఒక్కరు అంటే ఒక్కరు కూడా బయట నుంచి లోపలికీ రాలేదు బయటకీ వెళ్ళలేదు.. మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లి లారీలు కూడా నగరంలోకి వస్తే జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే అనుమతించారు గాని ఎక్కడా కూడా లైట్ తీసుకున్న పరిస్థితి లేదు. కేసీఆర్ ప్రతీ రోజు ప్రతీ గంటా కూడా సమీక్ష నిర్వహించారు.
చికెన్ షాపులను కట్టడి చేసారు, ఒక్క చికెన్ షాపు వద్ద కూడా జనం ఎక్కువగా లేకుండా చూసారు, గాంధీ ఆస్పత్రి పరిసరాల ను చాలా జాగ్రత్తగా గమనించారు, లాక్ డౌన్ ని లెక్క చేయకుండా బయటకు వచ్చిన వాళ్ళ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరికి కూడా స్వేచ్చ ఇవ్వలేదు. పరిస్థితి తీవ్రతను వివరించారు. ఇప్పుడు దీన్ని చూసి ముంబై ఢిల్లీ షాక్ అవుతున్నాయి. కేసీఆర్ కి ఫోన్ చేసే ఆలోచనలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారు.