భీష్మ, ట్విట్టర్ రివ్యూ, నితిన్ హిట్ కొట్టేసాడుగా ..!

-

నితిన్ హీరో గా వెంకి కుడుముల దర్శకత్వంలో వచ్చిన సినిమా భీష్మ. శివరాత్రి కానుకగా శుక్రవారం విడుదలైన ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మంధన నటిస్తుంది. ఈ సినిమా విదేశాల్లో ఇప్పటికే విడుదల అయింది. దీనితో ఈ సినిమా ఎలా ఉంది ఏంటీ అనేది ఇప్పుడు నితిన్ ఫాన్స్ తో పాటు సంక్రాంతి తర్వాత సరైన హిట్ లేక ఆశగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు.

ఇక అసలు ఈ సినిమా ఎలా ఉందీ అనేది ఒకసారి చూస్తే, సినిమా ఫస్టాఫ్ చాలా బాగుంది అంటున్నారు. నితిన్ కామెడి పండించాడని, దర్శకుడు క్లాస్ ని ఆకట్టుకునే విధంగా కామెడి చేసాడని అంటున్నారు. సోషల్ మీడియాలో దీనిపై ఇప్పుడు మంచి రివ్యూలే వస్తున్నాయి. నితిన్ కి ఏడాదిన్నర తర్వాత మంచి హిట్ దొరికింది అంటున్నారు ఫాన్స్. ఎక్కడా బోర్ కొట్టించకుండా సరదా సరదా సన్నివేశాలతో దర్శకుడు లాగించేశారట.

ఇక నితిన్ క్యారెక్టరైజేషన్ సినిమాకు అదనపు బలం అంటున్నారు. వినోదం కోరుకుని వెళ్ళే వారికి మాత్రం ఈ సినిమా అన్ని విధాలుగా నచ్చుతుంది అంటున్నారు. ఇక రష్మిక నటిగా మంచి ప్రదర్శనే చేసింది అనేది సినిమా చూసిన వాళ్ళ మాట. చాలా రోజుల తర్వాత నితిన్‌కు మంచి పాత్ర దొరికింది అంటున్నారు. ఇక దర్శకుడు కూడా ఈ సినిమాతో తన టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టడం లో సక్సెస్ అయ్యాడు అనే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news