ఎన్టీఆర్ కంటే ముందే ఆ తెలుగు స్టార్ హీరోలతో నటించిన జాన్వీ..!

-

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె గత ఐదు సంవత్సరాలుగా అక్కడ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో ఈమెకు ఎన్ని ఆఫర్లు వచ్చినా రిజెక్ట్ చేస్తూ వచ్చింది కానీ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ థర్టీ సినిమాలో అవకాశాన్ని అందుకొని నటించడానికి అంగీకరించింది. తాజాగా చిత్ర బృందం కూడా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ జాన్వి కపూర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

దీంతో ప్రతి ఒక్కరు జాన్వి కపూర్ ఎన్టీఆర్ 30వ సినిమా ద్వారా తొలిసారి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఎన్టీఆర్ 30 కన్నా ముందుగానే తెలుగులో ఆమె మరో ఇద్దరు స్టార్ హీరోలతో నటించిన విషయం చాలామందికి తెలియదు. ఇకపోతే జాన్వి కపూర్ నటించిన ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు దగ్గుబాటి రానా, విక్టరీ వెంకటేష్.. వీరిద్దరూ కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ లో జాన్వీ కపూర్ నటించినది.మార్చి 10వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్ లో రానా నాయుడు స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో.. తాజాగా రానా నాయుడు సిరీస్ ని ప్రొడ్యూస్ చేసిన నెట్ఫ్లిక్ సంస్థ వారు జాన్వి కనిపించే సీన్ ప్రోమో ని రిలీజ్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశారు.

మార్చి 10వ తేదీ నుండి రానా నాయుడు వెబ్ సిరీస్ నెట్ఫిక్స్ లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇలా జాన్వి ప్రోమోని విడుదల చేసినట్లు తెలుస్తోంది . ఇకపోతే రానా బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎలాంటి ప్రాబ్లం వచ్చిన ఆదుకునే పాత్రలో ఈ సిరీస్ లో నటించాడు.. ఇక తాజాగా జాన్వి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు రానా వచ్చి కాపాడినట్లుగా ప్రోమోలో చూపించారు. మొత్తానికైతే టాలీవుడ్ లో ఎన్టీఆర్ కంటే ముందే రానా వెంకటేష్ లతో ఎంట్రీ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version