బెల్లంకొండకి చావో రేవో…తేడా కొడితే ఇంటికే!

847

బెల్ల‌కొండ సాయి శ్రీనివాస్ హిట్ కోసం ఐదేళ్ల‌గా పోరాటం చేస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కూ ఆరు సినిమాలు చేసాడు. అన్ని ఒక‌టి కొక‌టి పోటీ ప‌డి మ‌రీ ప్లాప్ లు సాధించాయి. దీంతో ఆచిత్రాల నిర్మాత‌లు భారీగా నష్ట‌పోయారు. సినిమా పూర్తి చేసి రిలీజ్ రావ‌డం వ‌ర‌కూ ఒక ఎత్తైతే…ఆ త‌ర్వాత వాటి ప్ర‌చారం కోసం భారీగా ఖ‌ర్చు చేసారు. ఈ నేప‌థ్యంలో శ్రీనివాస్ ను-మీడియాను అడ్డుపెట్టుకుని ఆ జంట పీఆర్ ఓ ల‌క్ష‌ల్లో ఆర్జించారు. ప్ర‌మోష‌న్ కు కోసం అన‌వ‌స‌రంగా ఖ‌ర్చు చేయించిన వాళ్ల‌గా ఆ ఇద్ద‌రిపై ముద్ర ప‌డింది. ఈ భాగోతం తెలిసినా శ్రీనివాస్ మంచిత‌నంతో వాళ్ల‌ని ఏమీ అన‌లేదు. ఆవిష‌యం ప‌క్క‌బెడితే ఇప్పుడు శ్రీనివాస్ ప‌రిస్థితి వేరు. ప్ర‌స్తుతం చేతిలో రెండు, మూడు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి రాక్ష‌సుడు.

ఇది త‌మిళ రీమేక్ సినిమా. తెలుగు క‌థ‌ల‌పై న‌మ్మ‌కం కోల్పోయి త‌మిళ క‌థ‌ను ఎంచుకున్నాడు. ప్ర‌స్తుతం సినిమా సెట్స్ లో ఉంది. అన్ని ప‌నులు పూర్తిచేసి ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. అయితే ఈసినిమా త‌ర్వాత శ్రీనివాస్ కెరీర్ దాదాపు డిసైడ్ అయిపోయిన‌ట్లేన‌ని అంటున్నారు. సినిమా హిట్ అయితే కంటున్యూ అవుతాడు లేదంటే? న‌ట‌న‌కు గుడ్ బై చెప్పి నిర్మాణ రంగంలోకి వెళ్లిపోతాడ‌ని ఓ రూమ‌ర్ వినిపిస్తోంది. అద‌నం గాచేతిలో రెండు చిత్రాలు ఉన్న‌ప్ప‌టికీ ఆ క‌థ‌ల‌పై శ్రీనివాస్ కు పెద్ద‌గా న‌మ్మ‌కం లేదుట‌. ఏదో తండ్రి ఆబ్లిగేష‌న్ మీద ఒప్పుకోవాల్సి వ‌చ్చింది త‌ప్ప‌! అవేం గొప్ప క‌థ‌లు కాద‌ని అంటున్నారు. ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా వినిపిస్తోంది.

శ్రీనివాస్ త‌మ్మ‌డు గ‌ణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న‌ట్లు ఆ మ‌ధ్య ప్ర‌క‌టించారు. కానీ సినిమా ఇంకా ప్రారంభించ‌లేదు. ఈ నేప‌థ్యంలో శ్రీనివాస్ ని ఆపి గ‌ణేష్ ని రంగంలోకి దించాల‌ని తండ్రి బెల్లంకొండ సురేష్ కూడా స్ట్ర్టాంగ్ గా ఉన్నాడుట‌. ఇప్ప‌టికే శ్రీనివాస్ పై సురేష్ చాలా ఖ‌ర్చు చేసాడు. బ‌య‌ట నిర్మాతలు పెట్టుబ‌డి పెట్టినా అందులో కొంత సురేష్ ది కూడా ఉంది. గ‌ణేష్ ఎంట్రీ ఇచ్చినా తండ్రికి త‌ప్ప‌దు. కాబ‌ట్టి ఇద్ద‌ర్ని ఒకేసారి మోయాడం క‌ష్టం అవుతుంది. కాబ‌ట్టి శ్రీనివాస్ కి పుల్ స్టాప్ పెడితేనే బెట‌ర్ అని సురేష్ భావిస్తున్నారుట‌.