సిగిరెట్ మానేయాలనుకుంటున్నారా? ఈ వార్త మీకోసమే..!

477

హెల్ప్ లైన్‌కు వంద మందిలో కనీసం పది మంది అయినా ఫోన్ చేస్తారట. వాళ్లలో ఒక్కరు సిగిరెట్ తాగడం మానేసినా చాలు కదా. హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేయగానే.. ముందు మీ సిగిరెట్ చరిత్ర గురించి చెప్పాలని కోరుతారు.

సిగిరెట్ మానేయాలనుకుంటున్నారా? అయితే జస్ట్ ఈ వార్త చదవండి చాలు. సిగిరెట్ మానేయాలనుకునేవాళ్లు ముందు అసలు సిగిరెట్ తాగడం వల్ల దేశంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలి. ప్రతి సంవత్సరం కేవలం సిగిరెట్ తాగడం వల్ల దేశంలో ప్రతి ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. భారత ప్రభుత్వం చెబుతున్న సంఖ్య.

How to quit cigarette smoking

2016-17 లో గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ప్రకారం.. ఇండియాలో సిగిరెట్ తాగేవాళ్ల సంఖ్య 10 కోట్లకు పైనేనట. ఇది 2019 సంవత్సరం. అంటే సిగిరెట్ పెరిగే వాళ్ల సంఖ్య 10 కోట్ల కంటే ఎక్కువే పెరిగి ఉంటుంది కానీ తగ్గి ఉండదు. అందుకే 2018లోనే సిగిరెట్ ప్యాకెట్‌పై హెల్ప్ లైన్ నెంబర్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సిగిరెట్ మానేయాలనుకునే వాళ్లు ఆ నెంబర్‌కు కాల్ చేయాలంటూ ఆ నెంబర్‌ను ప్యాకెట్‌పై ముద్రిస్తారు. అది 1800-11-2356.

ప్యాకెట్‌పై హెల్ప్ లైన్ నెంబర్ ఒక్కటే కాదు.. పాగాకు వల్ల క్యాన్సర్ వస్తుంది, పొగాకు వల్ల మరణం సంభవిస్తుంది అని కూడా ముద్రిస్తున్నారు. అయితే.. కేవలం సిగిరెట్ ప్యాకెట్ మీద హెల్ప్ లైన్ నెంబర్, హెచ్చరికలు ముద్రించినంత మాత్రాన సిగిరెట్ తాగేయడం మానేస్తారా? అనే డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు.

అయితే.. హెల్ప్ లైన్‌కు వంద మందిలో కనీసం పది మంది అయినా ఫోన్ చేస్తారట. వాళ్లలో ఒక్కరు సిగిరెట్ తాగడం మానేసినా చాలు కదా. హెల్ప్ లైన్ నెంబర్‌కు ఫోన్ చేయగానే.. ముందు మీ సిగిరెట్ చరిత్ర గురించి చెప్పాలని కోరుతారు. మీరు ఎప్పటి నుంచి సిగిరెట్ తాగుతున్నారు? సిగిరెట్ మీకు ఎప్పుడు వ్యసనంగా మారింది? రోజుకు ఎన్ని సిగిరెట్లు తాగుతున్నారు? లాంటివి అడుగుతారు.

వాళ్ల నుంచి అన్ని సమాధానాలు తెలుసుకున్నాక.. సిగిరెట్ మానేయడానికి ఏం చేయాలో చెబుతారు. ఉదయం లేవగానే 2 గ్లాసుల వేడి నీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగాలని చెబుతారు. తేనెతో అయితే ఇంకా బెటర్. మనసులో ఎప్పుడూ నేను సిగిరెట్ మానేయాలి.. అని అనుకోవాలి. సంకల్పం అనేది చాలా ముఖ్యం. సిగిరెట్ సడెన్‌గా మానేయాల్సిన అవసరం లేకున్నా.. దానికి ఒక డెడ్‌లైన్ ఉండాలి. సిగిరెట్ ఎప్పుడైనా తాగాలని అనిపిస్తే.. ప్రశాంతంగా ఒక చోట కూర్చొని.. దీర్ఘంగా శ్వాస తీసుకొని.. నీళ్లు తాగాలి.

READ ALSO  ఆ టైంలో సూసైడ్ కు సిద్ధపడ్డ జయప్రద

అల్లం, కరక్కాయలను పొడి చేసి ఎండబెట్టాలి. దానికి నిమ్మకాయ పిండి, ఉప్పు కలిపి ఓ డబ్బాలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా సిగిరెట్ తాగాలనిపించినా ఆ పొడి తినాలి. ఇంకా ఎప్పుడు సిగిరెట్ తాగాలనిపించినా బయటికి వెళ్లి ఓ జ్యూస్ తాగండి. దాని వల్ల సిగిరెట్ తాగాలన్న కోరికను చంపేయొచ్చు.. అంటూ ఆ హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్ చేస్తే.. కౌన్సెలర్లు ఇవన్నీ చెబుతారు. కనీసం కౌన్సెలింగ్ వల్ల ఒక్కరు సిగిరెట్ తాగడం మానినా బెటరే కదా. కనీసం ఈ వార్త చదివి ఒక్క వ్యక్తి సిగిరెట్ మానేసినా చాలా బెటర్.